పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో 2019లో ఎమ్మెల్యే గా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, గిరిజన సంఘం నాయకుడు నిమ్మక సింహాచలం ఎస్టీ కాదని హై కోర్టు లో కేసు వేసిన విషయం విదితమే
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో ఈనెల 15వ తేదీన హై కోర్టు కేసు కొట్టివేసినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం మాజీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి శనివారం జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేశారు
Dlsc కమిటీ రిపోర్ట్ , స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో నెంబర్ 6 ను పరిగణనలోకి తీసుకొని పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అని కోర్టు అభిప్రాయపడి ఎలక్షన్ పిటీషన్ కేసు కొట్టివేశారు.
అంతిమ విజయం న్యాయనిదే 10 ఏళ్లుగా ఒక వర్గం పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేశారు. కానీ చివరికి న్యాయం గెలిచి కోర్టు కేసు కొట్టివేసిందని పుష్ప శ్రీవాణి అన్నారు.
ఈ కేసు 2019 ఎన్నికలకు సంబంధించిందని ఆ అసెంబ్లీ కాల పరిమితి 2024 సంవత్సరంతో పూర్తయినందున ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందని ఆమె తెలిపారు. 10 ఏళ్ళుగా హైకోర్టులో నడుస్తున్న కుల వివాదానికి తెరపడిందని హర్షం వ్యక్తం చేశారు. న్యాయన్నీ నమ్మాను నా నమ్మకం ఒమ్ముకాలేదు.