వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి అవక తవకలు జరగలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ షర్మిస్టా స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో డిఎంహెచ్వో(DMHO) కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో ఎవరైనా అధికారి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను ఉద్యోగ నిర్వహణలో నియమ నిబంధనలతో ఉంటానని ఏ సమయంలోనైనా అభ్యర్థులకు జిల్లా కార్యాలయం ద్వారా ఏ అధికారి అయిన ప్రలోభ పెట్టినట్లు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై క్లారిటీ
