సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని మాతా శిశు ఆస్పత్రిని సందర్శించిన మాజీ ఎఫ్ డీ సీ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ- పది రోజుల్లో గజ్వేల్ మాతా శిశు ఆస్పత్రిలో పూర్తి వైద్య సేవలు అందించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో వైద్య సేవలు నిర్వీర్యం అయ్యాయని, గతంలోని కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ లో అధునాతనంగా నిర్మించిన జిల్లా ఆసుపత్రి లలో పూర్తిస్థాయి వైద్యమందక పేదలు చాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని,వెంటనే గజ్వేల్ మీద దృష్టి సారించి నిలిచి పోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అన్నారు.
మాతా శిశు ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించి వైద్యుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదేళ్లలో జిల్లా స్థాయి దావఖానలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కెసిఆర్ దే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, రాజమౌళి, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా,బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.