ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు రైతుల పిలుపు

The Andhra Pradesh Farmers' Association is organizing a regional conference in Anakapalli on October 22 to address irrigation issues affecting farmers. The conference aims to find long-term solutions to the water crisis. The Andhra Pradesh Farmers' Association is organizing a regional conference in Anakapalli on October 22 to address irrigation issues affecting farmers. The conference aims to find long-term solutions to the water crisis.

అనకాపల్లిలో జరుగు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి. ఒకప్పుడు నాగావళి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓపెన్ హెడ్ చానల్స్ ద్వారా సాగునీరుతో మూడు కాలాలు పొలాలు పచ్చని పంటలు తో రైతులు, కూలీలు సంతోషంగా జీవించారని నేడు ఆ భూములు పంటల పండక రైతులు దివాలా తీస్తున్నారని దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్య వైఖరే అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

 ఓపెన్ హెడ్ చానల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకోవడం తోపాటు ఇసుక మెటలు, తుప్పలు,డంకలతో కాలువలు దర్శనమిస్తున్నాయి. అక్టోబర్ 18 వచ్చినప్పటికీ చుక్క నీరు కాలువ ద్వారా రాకపోవడంతో ఆకాశాన్ని నమ్ముకుని వర్షాధారంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా నేడు పొట్ట,వెన్ను పొడుస్తున్న సమయంలో ఇటు కాలువ నీరురాదు అటు వర్షం లేదు పంట ఏమో పూర్తిగా ఎండిపోయి రైతు పెట్టిన పెట్టుబడులు నేలపాలు కావలసి వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఈ మధ్యకాలంలో స్థానిక ఎమ్మెల్యేని రైతులు సాగునీరు గురించి విజ్ఞప్తి చేయగా లిఫ్ట్ ఏర్పాటు చేయుటకు అధికారులకు సాధ్యసాధ్యాల గురించి సూచన చేశారు. రైతుకు నీరు ఇవ్వడం ఎంత అవసరమో తదుపరి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా పెద్దలపై ఉంటుంది. తాత్కాలిక ఉపశమన కార్యక్రమముల కన్నా దీర్ఘకాలిక శాశ్విత సమస్య  పరిష్కరిం చూపడం అవసరం. బూర్జ మండల కాలువల రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు మూడు పరిష్కారాలు ఉన్నాయి. 

1. వంశధార నుండి పాలకొండ మండలం ఓనిగడ్డకు అనుసంధానం చేయటం. 2.తోటపల్లి నుండి ఓపెన్ హెడ్ చానల్స్ కి ఓనిగడ్డకు అనుసంధానం చేయడం. 3.గోదావరి నది నుండి బాబు జగ్జివన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 17వేల ఎకరాలు సాగును ఇచ్చే హక్కును పొందడం ద్వారా ఆయికట్టు రైతులకు సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి ఎంతో ఉపయోగపడతాయని వాటికోసం స్థానిక గౌరవ శాసనసభ్యులు కృషి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

వాస్తవానికి నాగావళి నదిలో ఉన్న నీరు నారాయణపురం దగ్గర వాడుకోవలసిన వాడుకోలేకపోవటం వల్ల ఒకవైపు ఎచ్చెర్ల మండలం పొన్నాడ తదితర 13 పంచాయతీలకు ఏమో సాగునీరు అందటం లేదు.ఆ రైతులు రోడ్డునెక్కుతున్నారు. నాగవళి నది నుండి 19 టీఎంసీల నీరు ప్రతి ఏటా సముద్రంలో వృధాగా కలుసి పోతుందని గుర్తు చేశారు.

ఉన్న నీటిని ఉపయోగించుకోకుండా పనిచేయని లిఫ్టులు ద్వారా సాగునీరు గురించి ఆలోచించడం సరికాదని ఆయన అన్నారు.
ఇలాంటి సమస్యల పరిష్కారం గురించి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సును ఈ నెల 22వ తేదీన అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమంలో రైతు పక్షపాతి అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ (ఉత్తరాంధ్ర సాగు నీటి ప్రాజెక్టుల సాధన సమితి కన్వీనర్), ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ, అనుభనీయులు సాగునీటి నిపుణులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎస్ సత్యనారాయణ రాజు హాజరవుతున్నారు.
అనకాపల్లి లో జరుగుతున్న ప్రాంతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని రైతులకు అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, ఆయకట్టు రైతులు దుప్పాడ భాస్కరరావు, మక్క సూరపునాయుడు,రామకృష్ణ, శ్రీనివాసరావు, విస్సు,సత్యంనాయుడు, క్రిష్ణ, తవుడు, తవిటినాయుడు, తమ్మినాయుడు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *