ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణములో బాలికలకు గురువారం మాక్ పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా ఓటర్ లిస్ట్ ప్రకటించి, తరగతి ఆయా సెక్షన్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ ముద్రించడం, పోలింగ్ ఏజెంట్ల ఏర్పాటు, పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారుల నియామకంతో సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సోషల్ అసిస్టెంట్ ఎం సలోమి మాట్లాడుతూ 6, 7 తరగతులకు చెందిన బాలికల కు ఎన్నికలపై అవగాహన కోసం మాక్ పోలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో తీసుకునే జాగ్రత్తలు, ఏర్పాట్లు, సిబ్బంది మొత్తం ప్రక్రియ కొనసాగించి ఎలక్షన్ కొనసాగించడంతో బాలికలకు సాధారణ ఎన్నికలలో పోలింగ్ పై పూర్తి అవగాహన కలిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం నాగబాబు, మ్యూజిక్ టీచర్.
జడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో మాక్ పోలింగ్ కార్యక్రమం
