జగనన్న కాలనీల పేరుతో పేదలకు అత్యంత నాసిరకంగా ఇళ్లు నిర్మించారు. శ్లాబులో మందం తగ్గిపోయింది…స్టీల్ రాడ్ల ఏర్పాటులోనూ చేతివాటం ప్రదర్శించారు. ఇంటి నిర్మాణంలో కీలకమైన పునాదుల నిర్మాణంలోనూ అంతా మోసమే. పార్టీషియన్ వాల్ నిర్మాణంలోనూ వెడల్పు తగ్గించేశారు. కాలనీల పేరుతో కోట్లు గడించిన కాకాణి అండ్ బ్యాచ్ ఒక్కసారి ఈ ఇళ్ల మరుగుదొడ్డిలోకి వెళ్లగలరా. పేదలంటే అంత అలుసా…ఇంత దారుణమైన వ్యక్తులను ఎప్పుడూ చూడలేదు. ఒక్క ఈ కాలనీలోనే రూ.20.50 లక్షలతో మట్టి తోలినట్టు బిల్లులు చేసుకున్నారు. ఒక్కో లబ్ధిదారుడి వద్ద ఇంటికి రూ.40 వేల వరకు అదనంగా గుంజుకున్నారు. చివరకు మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడ్డారు. నాలుగైదు అడుగుల ఎత్తులోనే మరుగుదొడ్డి నిర్మించడం దుర్మార్గం. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లాను. సీఎం చంద్రబాబు నాయుడి ఆదేశాలతో ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ అక్రమాల మీద స్పందించి పేదల ఇళ్ల పేరుతో దోచుకున్న కోట్ల రూపాయలను అక్రమార్కుల నుంచి కక్కించి వారిని బొక్కలో వేయాలి.
జగనన్న కాలనీలలో అవినీతి పండగ
