నరసరావుపేటలోని హర్డ్ హైస్కూల్ స్థలాలపై కబ్జాదారుల కన్ను. హర్డ్ హైస్కూల్ , కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. హర్డ్ హైస్కూల్ స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారన్నారు. ఈ హర్డ్ హై స్కూల్ 1883లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా గ్రామీణ బాలికలకు విద్యను అందించడానికి స్థాపించబడింది. 1930లో దీనిని మిడిల్ స్కూల్‌గా ఏర్పాటు చేసి 1946లో ఉన్నత పాఠశాలగా మార్చారు. ఎన్నో లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకున్నారు. తూర్పు కాంపౌండ్ వాల్ 10 ఎకరాలు వెస్ట్ కాంపౌండ్ వాల్ 11 ఎకరాలు. ఈ స్థలాన్ని విక్రయించకూడదు లేదా కొనకూడదు, కానీ అప్పట్లో కొంతమంది నిర్వాహకులు కొనుగోళ్లు చేశారు. సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని ఆర్డీఓ, డీఎస్పీ పరిశీలించారు. మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని ప్రభుత్వం తిరిగి ఇప్పించాలని కోరుతున్నాం. FIBI ప్రిన్సిపాల్.
నరసరావుపేట హర్డ్ హైస్కూల్ స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులు
