నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం డీఎస్సీ 2024 కు సంబంధించిన ముగ్గురు ఉపాధ్యాయులు పాఠశాలకు నియమించినట్లు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా పాఠశాలలో ఉపాధ్యాయుల కోరత ఉన్నందున పాఠశాలకు నూతన పోస్టులు మంజూరు చేసినందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎంఈఓ డిఈఓ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు చక్కటి విద్య బోధన అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులునరేష్,శ్రీలత,బాజా రాజేందర్, నేరోళ్ల శ్రీనివాస్,జెల్ల శ్రీకాంత్ గౌడ్,బాలమణి, తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట పాఠశాలలో ముగ్గురు కొత్త ఉపాధ్యాయుల నియామకం
