గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల అభివృద్ధి సాధనకు కృషి చేస్తామని ఐటీడీఏ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు.
మంగళవారం కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీలో చింతమానుగూడలో గిరిజన కళాక్షేత్రం & మినీ మ్యూజియంను ప్రారంభించారు.
ఈ సందర్బంగా పార్వతిపురం మన్యం జిల్లా ఐటిడిఏ పిఓ ఆశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని పరిరక్షించడం, గిరిజన మరియు జానపద కళలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
ఏజెన్సీలో గిరిజన యువత ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు అండగా ఉంటానని తెలిపారు.
గిరిజన మ్యూజియంలో ప్రదర్శించిన జీవన విధానాలను ప్రదర్శించేందుకు ఆభరణాలు, వేట సాధనాలు, వంటగది ఉపకరణాలు, వనమూలికలను పరిశీలించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మన్మధరావు, ఆదివాసీ గిరిజన నాయకులు రామకృష్ణ, చంద్రశేఖర్, నీలకంఠం, కడాయి, రామారావు, పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.