ప్రత్తిపాడు లోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 2004-2005 లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు.
పూర్వ విద్యార్థులు కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు