ఆదోని మండలం పరిధిలో జాలమంచి గ్రామంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ అంబా భవాని దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల భాగంగా 9వ రోజు శ్రీ అనపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు. ఈ రోజు తెల్లవారుజామున శ్రీ అన్నపూర్ణ దేవికి పంచ అమృత అభిషేకం అన్నపూర్ణ దేవి అష్టోత్తర శతనామావళి గ్రామంలో ప్రతి గడప నుంచి ఆడపడుచులు తెల్లవారుజాము నుంచి శ్రీ అంబా భవాని దేవాలయములో శ్రీ అన్నపూర్ణ దేవికి కుంకుమార్చన నిర్వహించారుభక్తులుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భావనచంద్ర మాజీ విఆర్ఓ ఆదినారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మల్లికార్జున విజయ భాస్కర్ దత్తాత్రేయ పాండురంగ దండు చందు మరియు గ్రామ ప్రజలు.
జాలమంచి గ్రామంలో దసరా ఉత్సవాల శోభ
