సంపాదించిన దానిలో 60 శాతం సేవ కోసం ఖర్చు చేస్తూ దేశ అభివృద్ధికి తన వంతు సహాయకారాలను అందిస్తున్న మహా గొప్ప వ్యక్తి రతన్ టాటా అని చిన్న శంకరంపేట మాజీ సర్పంచ్ రాజ్ రెడ్డి అన్నారు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద మెదక్ చేగుంట రహదారిపై టాటా కంపెనీ అధినేత రతన్ టాటా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి చిన్న శంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి లు మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సంపాదించిన దానిలో 60% సేవా కార్యక్రమాలకు ఖర్చుపెట్టి పేదవారిని ఆదుకునేందుకు ముందుండే మహా గొప్ప వ్యక్తి దేశ అభివృద్ధికి తన వంతు సహకారాలు అందించిన ఉత్తములు రతన్ టాటా అని రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు అని వారు తెలిపారు ఆయన చూపిన సేవా మార్గంలోనే ముందుకు సాగాలని టాటా కంపెనీ అధినేత రతన్ టాటా సంపాదనలో 60 శాతం దేశాభివృద్ధికి ఖర్చు చేసేవాడని అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దురాదృష్టకరమని వారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ రాజ్ రెడ్డి, చిరంజీవి, రమేష్ గౌడ్,రామచంద్రం, ఎడ్ల కిష్టయ్య, ఎర్రి కుమార్, మేడి వెంకటి, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
రతన్ టాటా సేవలను గుర్తించిన చిన్న శంకరంపేట నాయకులు
