ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు, ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని వనమాలి, సిటిజి సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మళ్ళా సరిత, అరవల అరుణ, జ్యోతి నాదెళ్ల ముగ్గురూ కలిసి గడిచిన పది రోజులుగా ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, పెందుర్తి, ద్వారకా నగర్, ఒన్ టౌన్, మద్దిలపాలెం, గాజువాక, ఎన్ఎడి, అక్కయ్య పాలెం, ఎండాడ, కుర్మన్న పాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటి పై కప్పు మీద ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, విత్తనాలు తయారు చేసుకోవడం, చీడ, పీడల నివారణ మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎకొ వైజాగ్ లో భాగంగా కూరగాయల నారు, విత్తనాలు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అంద జేశారు. ప్రధానంగా బత్తిలి వంకాయ, గుంటూరు పచ్చి మిర్చి, టమాటా, బంతిపూల నారు, గుత్తి బీర, నేతి బీర, చిత్రాడ బీర, బెండ, కాకర, తోట కూర, గోంగూర, పాలకూర, చుక్క కూర తదితర విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఇంటి వద్ద కూరగాయలు ఆకుకూరలు పండ్లు జాతి మొక్కలు పెంచడం గురించి మాట్లాడారు. పలు అంశాలపై ప్రశ్నలు వేసి తమ సమస్యలకు పరిష్కారాలు సహజసిద్ధంగా చేయడం గురించి అవగాహన పొందారు. అలాగే పురాతన పద్దతి లో విత్తనాలు, కూరగాయలు, పండ్లు జాతి మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానం లో పంపిణీ చేశారు.
ఇంటి పైకప్పుపైన ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై ప్రచారం
