విజయనగరం పట్టణంలో ఘోషా ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన “అన్న క్యాంటీన్” ను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి , బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఇమంది సుధీర్ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు సతీమణి శ్రీమతి సునీల గజపతి రాజు “అన్న క్యాంటీన్” కోసం ఇచ్చిన రూ. 1,00,000/- ల విరాళం చెక్కును నగరపాలక సంస్థ కమిషనర్ కి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు అందించారు.