కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పై ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నేను వేసిన యార్కర్ కు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాలు విరిగి ఏదోదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తుందని..నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటే కుదరదన్నారు ఈ నాలుగేళ్లు ప్రజల తరపున పోరాడుతూ ఉంటామని స్పష్టం చేశారు. వైయస్సార్ పుణ్యం పైన గెలిచిన నీవు జగన్నే పోటీకి రమ్మంటున్నావన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే పిల్లిలా రాష్ట్రం వదిలి పోయిన నీవు జగన్ పోటీకి వస్తే తట్టుకునే శక్తి నీకుందా అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఘాటువాక్కలు విమర్శించారు.
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై రామ సుబ్బారెడ్డి ఘాటు విమర్శలు
