కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎస్పీ వర్గీరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన దళితులు మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ తో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్బంగాఏలేశ్వరం మడలపరిధిలో అన్ని గ్రామాలతో పాటు ఏలేశ్వరం పట్టణంలో భారీ ఎత్తున భైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్పందించినప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన మాల, మాదిగలు ఇద్దరు సమానమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం సరిగాదన్నారు. సామాజికంగాను,ఆర్థికంగా రెండు వర్గాలకు చెందిన వారు సమానమేనన్నారు. అటువంటి మమ్మల్ని వేరే చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయడం తగదన్నారు. తామంతా కలిసి ఉండేలా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమలో దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏలేశ్వరంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బైక్ ర్యాలీ
