నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గమ్మ వారు ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో గ్రామ ముత్తైదుల మహిళలచే, కుంకుమార్చన దాత మాజీ జెడ్పిటిసి పంజా పద్మజా విజయ్ కుమార్ దంపతుల సహకారంతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా గ్రామంలోని ముత్తయిదువుల చేత కుంకుమార్చన కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముత్తయిదు మహిళలకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలన్నారు. అనంతరం నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. కుంకుమార్చన, అన్నదాన ప్రసాద దాతలకు శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, మాసుల కరుణాకర్, వినయ్ గౌడ్, మావురం రాజు,మల్లేశం గౌడ్, మాసుల కృష్ణ,రంజిత్ గౌడ్, శివకుమార్, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గ మాత స్వాములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.