పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4,23,702 నగదు చెక్కులను ఆయన అందజేశారు. అదేవిధంగా నల్లా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కె. ఏనుగుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం లో వైద్య పరీక్షలు చేయించుకున్న పలువురికి ట్రస్టు తరుపున మంజూరైన కళ్ళజోళ్ళను ఎమ్మెల్యే సత్యనారాయణ పవన్ కుమార్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలొ ఉమ్మడి కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం
