మండల కేంద్రమైన చాగలమర్రిలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నేడు రెండవ రోజు శ్రీ సావిత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.శ్రీ అభినవశంకరానంద స్వామి వారిచే ప్రవచనాలు తెలియజేయడం జరిగింది.సుంకు రమణయ్య మనవరాలు చిన్నారి రోషిణి కూచిపూడి నృత్యం అలరించింది. ఆలయ ప్రధాన పూజారి పుల్లెటికుర్తి రాధాకృష్ణ ఆధ్వర్యములో హారతులు ఇచ్చారు.ఆలయము చుట్టు అమ్మవారిని రెండు ప్రదక్షిణలు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కమిటీ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ బాబు , ధర్మకర్త కృష్ణం శివ ప్రసాద్ , కమిటీ సభ్యులు , ఆర్యవైశ్యులు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చాగలమర్రిలో దసరా ఉత్సవాలు
