సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేస్తాఅని, చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు వీరి యొక్క పాలన ఉందని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో గల కందుకూరు మండలంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..
సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించలేదని, ఫోర్త్ సిటీ పేరుతో ఫోర్త్ బ్రదర్స్, రియల్ ఎస్టేట్ కోసం అసైన్డ్ మెంట్ భూములను ,పేదల స్థలాలను గుంజుకోవాలని చూస్తున్నారని, ఫార్మాసిటీని రద్దు చేయాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోదండ రెడ్డిని తాను డిమాండ్ చేశానని ఆయన పేర్కొన్నారు.
కానీ నేడు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నారని, ఫార్మాసిటీ భూములను రైతులకు వాపస్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా, వడ్లకు బోనస్ ఐదు వందలు, రూ.రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేటికీ అమలు చేయలేదని, కౌలు రైతులకు బోగస్ మాటలు చెప్పాడని, రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కోసం రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మారుస్తున్నారని, ఫోర్త్ సిటీ పేరుతో పేదల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని,అలాగే ‘మెట్రో’ ఉచిత పార్కింగ్ కల్పించాల్సిందేనని,
రైతులకు కోర్టుల్లో ఇబ్బందులు వస్తే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాదని ఆయన తెలిపారు.