90వ వార్డ్ లోని సీతారామరాజు నగర్ నందు శివాలయం అనుకోని ఉన్న CC డ్రైన్ గత 15 సంవత్సరాలుగా పూడిక పేరుకుపోయి శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా చిన్న చిన్న వర్షాలకు సైతం డ్రైన్ లోని వర్షం నీరు శివాలయం లోని చేరి తీవ్ర దుర్గంధం రావడంతో సమస్యను 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా , బొమ్మిడి రమణ గారు స్పందించి HNR Arcade అపార్ట్మెంట్ నుండి బుచ్చిరాజుపాలెం SC కాలనీ వరకు నూతన CC డ్రైన్ ప్రతిపాదనలు తయారు చేయించడమే కాకుండా పశ్చిమ నియోకవర్గం శాసనసభ్యులు శ్రీ గణబాబు గారి సూచన మేరకు 19.00 లక్షల జీవీఎంసీ వార్డ్ అభివృద్ధి నిధులు మంజూరు చేయించడమే కాకుండా నేడు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ విభాగం A.E వెంకట లక్ష్మీ , సీతారామరాజు నగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస రాజు గారు, జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామ కృష్ణ గార, 90వ వార్డ్ అధ్యక్షులు యలమంచిలి ప్రసాద్ గారు, విశాఖ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు నరవ పైడిరాజు గారు, శివాలయం ఆలయ ప్రతినిధులు, భారత్, ఇచ్చాపురపు నాగేంద్ర కుమార్, కృష్ణ మోహన గారు, మున్నా గారు, యలమంచిలి కిషోర్, శ్రీను పట్నాయక్, చుక్క లక్ష్మీ రెడ్డి మహిళలు పాల్గొన్నారు