శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల 45వ వసంతం వేడుక

Sri B. Vemula Veerareddy Degree College celebrated its 45th anniversary with esteemed guests highlighting the importance of skill-based education. Sri B. Vemula Veerareddy Degree College celebrated its 45th anniversary with esteemed guests highlighting the importance of skill-based education.

బద్వేల్ పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తిచేసుకుని 45వ వసంతంలోనికి అడుగుడిన సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగివేమన విశ్వవిద్యాలయ ఆచార్య కృష్ణారెడ్డి , బద్వేల్ కళాశాలల సెక్రటరీ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కె.రితేష్ కుమార్ రెడ్డి గార్లు విచ్చేసి కళాశాల స్థాపకుడు శ్రీ బీజ వేముల వీరారెడ్డి గారి చిత్రపట మునకుపూలమాలవేసీ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ “నైపుణ్యాలతో కూడిన విద్యనభ్యసించడం నేటి కాలానికి చాలా అవసరమని అది నెరవేరాలంటే మనకంటూ ఒక లక్ష్యం ,దాన్ని నెరవేర్చుకునేతపనఉండాలన్నారు .

ఈ కార్యక్రమంలో కళాశాలల డీన్ డాక్టర్ బి .రామలక్ష్మి రెడ్డి ,
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్
కె. వెంకటసుబ్బారెడ్డి , బి.ఎడ్ .కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్ గార్లతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *