రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రేరేపకుల గౌరవారోపణ

Indian Red Cross Society celebrated National Voluntary Blood Donation Day, honoring blood donor motivators with awards and recognizing their contributions. Indian Red Cross Society celebrated National Voluntary Blood Donation Day, honoring blood donor motivators with awards and recognizing their contributions.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీ రాములు జిల్లా శాఖ రక్త నిధి కేంద్రం నందు ఈ రోజు 03/10/2024 న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాలను పురస్కరించుకొని అత్యధిక సార్లు రక్తం ఇప్పించిన రక్తదాన ప్రేరేపకుల (మోటివేటర్స్) కు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రములు రెడ్ క్రాస్ ఛైర్మన్ గారిచే అందచేయబడినది.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కన్వీనర్ శ్రీ సి.హెచ్ అజయ్ బాబు తో కలిసి మొదటగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు శ్రీ జీన్ హెన్రి డ్యూనాంట్ మరియు ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అండ్ ఇమ్యునోహెమటాలజీ వ్యవస్థాపకులైన డా. JG జోలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరము రెడ్ క్రాస్ ఛైర్మన్ మరియు ఎమ్మెల్సీ శ్రీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ లో 14 విభాగముల సేవలను అందిస్తున్నారని, అందులో ముఖ్యంగా కాన్సర్ హాస్పిటల్, రక్తనిధి కేంద్రం, తలసీమియా సెంటర్, స్పాస్టిక్ సెంటర్ మరియు యితర కార్యక్రమములను చేస్తూ, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నెల్లూరు రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంకి గుర్తింపు ఉండడం చాలా ఆనందంగా ఉంది అని తెలియచేసారు మరియు రాష్ట్రములో రక్త నిల్వలు కొరత వలన ఇంకా అనేక మందికి రక్తము అవసరం ఉన్నందున యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు లో మరిన్ని అధునాతన పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి జిల్లాలో మేటి బ్లడ్ బ్యాంకు గా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ను తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఒక విశిష్ట స్థానం వుందని, నెల్లూరు జిల్లాలో ఎటువంటి విపత్తులు ఎదురైన మేము వున్నామని ధైర్యాన్ని కలిగించి వారికి ఆపన్న హస్తమును అందిస్తున్నారని ఇంతమంది రక్త ప్రేరపకులకు (మోటివేటర్స్) రెడ్ క్రాస్ లో చూడడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలియచేసారు.
తలసీమియా పిల్లల కొరకు రెడ్ క్రాస్ రక్త నిది కేంద్రం నుండి రక్తాన్ని ఇవ్వడం జరుగుతుందని, ప్రతినెలా తలసీమియా పిల్లలకు రక్త మార్పిడి చేయాల్సి ఉన్నందున వారి కొరకు ప్రత్యేకంగా రక్తాన్ని ఉంచుతూ వారు ఆరోగ్యకరంగా ఉంచుతూ, అలానే వారి కొరకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా తలసీమియా రహితులుగా మార్చడం కొరకు దాతల సహాయముతో 25 లక్షల నుండి 40 లక్షల వరకు ఖర్చయ్యేటువంటి ట్రీట్మెంట్స్ అందించి ఇప్పటివరకు ఏడుగురిని తలసీమియా రహితులుగా మార్చడం జరిగినదాని తెలియజేశారు. ఇకముందు కూడా ఉన్నటువంటి తలసీమియా చిన్నారులను తలసీమియా రహితులుగా మార్చడం కొరకు కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం అత్యధిక సార్లు రక్త దానం చేయించిన సుమారు 138 రక్త ప్రేపరకులకు (మోటివేటర్స్) జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలతో పాటు సన్మానము చేయడం జరిగింది
ఈ కార్యక్రమములో వైస్ ఛైర్మన్ శ్రీ డి.సుధీర్ నాయుడు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ డాకారపు రవి ప్రకాష్, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు బ్లడ్ సెంటర్ అడ్వైసర్ శ్రీ మలిరెడ్డి కోటారెడ్డి, శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ కలికి శ్రీహరి రెడ్డి, శ్రీ గంధం ప్రసన్నాంజనేయులు, రెడ్ క్రాస్ తలసేమియా కో కన్వీనర్ శ్రీమతి Sk. పర్వీన్, రెడ్ క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ కో కన్వీనర్ శ్రీ యన్ బలరామయ్య నాయుడు, రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *