గిరిజన గ్రామాల అభివృద్ధి పదములో ఉన్నాయి అంటున్న రాష్ట్ర ప్రభుత్వాల హామీలు అన్ని నీటి మీద మూటలా ఉన్నాయి తప్ప ఆచరణలో లేవని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో గిరిజన గ్రామాల నుండి మైదాన ప్రాంతాలకు రావాలంటే రహదారి వ్యవస్థ ఎంతో ముఖ్యం అవసరం కానీ ఆయా గిరిజన గ్రామాలలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు గాని గిరిజన గ్రామాలకు రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కినుకు వహిస్తున్నారు అన్న ఆరోపణలు కోకలలుగా ఉన్నాయి.
దీనిపై ఏ వన్ టీవీ ప్రత్యేక కథనం……
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం
అడ్డతీగల మండలం పింజరికొండ గ్రామానికి చేరాలంటే ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని ఆ గ్రామం వెళ్ళవలసిన పరిస్థితి..
దశాబ్ద కాలము నుండి రాష్ట్రంలో పలు పార్టీలు. అధికారం చేపట్టడానికి ఓట్లు కోసం గిరిజన గ్రామాలను సందర్శించి మీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం కాలువలపై వంతెన నిర్మిస్తాం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టి ఆ హామీలు మరిచిపోయిన దాఖలాలు గిరిజన గ్రామాలలో నిత్యం దర్శనమిస్తూ ఉంటాయి..
దీనిలో భాగంగానే పింజరి కొండ గ్రామంలో సుమారు 200 కుటుంబాలు వారు నివసిస్తూ ఉంటారు, ఆ గ్రామం నుండి నిత్యవసరాల నిమిత్తం ,వైద్య సేవల నిమిత్తం, బయట ప్రాంతాలకు రావాలంటే పెద్ద స్థాయిలో ప్రవహిస్తున్న కొండ కాలువను దాటి రావలసిన పరిస్థితి ఆ కాలవను దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పయనించవలసి వస్తుంది.
గ్రామం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ కొండలు, గ్రామం చుట్టూ కొండ కాలువ నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది….
ఈ విషయమై ఏ వన్ టీవీ ప్రతినిధి తో గ్రామ గిరిజనులు మాట్లాడుతూ……
దశాబ్ద కాలము నుండి కూడా తమ గ్రామానికి రహదారి సౌకర్యం అనేది లేదు, కాలువపై వంతెన నిర్మించిన దాఖలాలు లేవు, ఉన్నత స్థాయి అధికారులు వచ్చినప్పుడు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, ఆ గ్రామ గిరిజనులు తమ గ్రామానికి కాలువపై వంతెన నిర్మించాలని పలు దపాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని.. రంపచోడవరం ఐటీడీఏ గ్రీవెన్స్ లో వినతి పత్రాలు సమర్పించిన….. పట్టించుకునే నాధుడే కరువైపోయాడు.. అని మిరియాల బుజ్జి బాబు వాపోయారు.
పింజరికొండ పర్యాటక ప్రాంతంగా ఉండడంతో మైదాన ప్రాంతాల నుండి పర్యాటకులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు కానీ సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్ల ఆ పర్యటక ప్రాంతంలో పదుల సంఖ్యలో పర్యాటకులు మరణించిన సంఘటనలు ఉన్నాయి..
గ్రామంలో అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రసవ వేదనలో ఉన్న మహిళలను అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే నరకయాతన పడవలసి వస్తుందని సుమారుగా ఎనిమిది మంది ఉంటే కానీ కాలువ దాటి వెళ్లే పరిస్థితి లేదని ఆ గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
…. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న రంపచోడవరం ఏజెన్సీలో తమ బ్రతుకుల్లో మార్పు రావడంలేదని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు……..
తమ గ్రామానికి కాలువపై వంతెన నిర్మించి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని పింజరికొండ గ్రామ గిరిజనులు అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.