గిరిజన పాత్రికేయుల హక్కుల కోసం నిరసన

Tribal journalists in Alluri district protested against the unlawful removal of huts in a designated area, demanding action against the local TDP Sarpanch for their rights and housing. Tribal journalists in Alluri district protested against the unlawful removal of huts in a designated area, demanding action against the local TDP Sarpanch for their rights and housing.

అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గిరిజన పాత్రికేయులకు పాడేరు లగిసపల్లి వద్ద కేటాయించిన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన రేకులు షెడ్లను అక్రమంగా తొలగించిన టిడిపి సర్పంచ్ పై తగు చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ

గిరిజన పాత్రికేయులు స్థానిక గాంధీ విగ్రహం వద్ద బుధవారం మెమోరాణం సమర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు

ఈ కార్యక్రమానికి మద్దతుగా ఆదివాసీ గిరిజన మహిళ సంఘా అధ్యక్ష కార్యదర్శులు టి. కౌసల్య, ఎస్ హైమావతి పాల్గొన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పాత్రికేయులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు మీద రాజకీయం చేయడం సరికాదని వారు హెచ్చరించారు.

ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటున్న పాత్రికేయులకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలోని రేకుల షెడ్లు నిర్మించుకుంటే అక్రమంగా కుల్చివేసిన లగిసపల్లి సర్పంచ్ లకే.పార్వతమ్మ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

గిరిజన పాత్రికేయులకు కేటాయించిన ఇళ్ల స్థలంలోని మరల పున ప్రారంభం చేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గణేష్, నాగరాజు,ఆనంద్,పండు, శ్రీను, భాస్కర్,చిరంజీవి,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *