కేదార్ నాథ్‌లో ఆర్మీ హెలికాప్టర్ రిపేర్ ప్రమాదం

కేదార్ నాథ్‌లో మరమ్మతులకు తరలిస్తున్న హెలికాప్టర్ అధిక బరువు, గాలుల కారణంగా ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ నుంచి జారిపడి మందాకిని నదిలో పడిపోయింది. కేదార్ నాథ్‌లో ఆర్మీ హెలికాప్టర్ రిపేర్ ప్రమాదం

కేదార్ నాథ్ లో ఇటీవల రిపేర్ కు వచ్చిన హెలికాఫ్టర్ ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా జారిపడింది. ఆర్మీ హెలికాఫ్టర్ కు కేబుల్స్ తో కట్టి తీసుకెళుతుండగా శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అధిక బరువు, గాలుల కారణంగా ఆర్మీ హెలికాఫ్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో గత్యంతరం లేక మోసుకెళుతున్న హెలికాఫ్టర్ ను వదిలేశారు. లింఛోలి ఏరియాలో మందాకిని నదిలో ఈ హెలికాఫ్టర్ పడిపోయింది. పైనుంచి కిందపడడంతో హెలికాఫ్టర్ తుక్కుతుక్కుగా మారింది.

కేదార్ నాథ్ కు భక్తులను తరలించేందుకు ఉపయోగిస్తున్న ఓ హెలికాఫ్టర్ గత మే నెలలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ ట్రావెల్స్ కంపెనీ సదరు హెలికాఫ్టర్ ను పక్కన పెట్టింది. తాజాగా శనివారం దానిని మరమ్మతు చేయించడానికి ఏర్పాట్లు చేసింది. ఆర్మీకి చెందిన ఎంఐ–17 ఛాపర్ తో ఈ హెలికాఫ్టర్ ను గౌచర్ కు తరలించేందుకు సిద్ధం చేసింది. కేబుల్స్ తో బిగించాక ఎంఐ 17 ఛాపర్ గాల్లోకి ఎగిరింది. దాంతో పాటు ఈ హెలికాఫ్టర్ కూడా పైకి లేచింది. కొద్దిదూరం బాగానే సాగిన ఈ ప్రయాణం.. హెలికాఫ్టర్ బరువు ఎక్కువగా ఉండడం, బలమైన గాలుల కారణంగా ఎంఐ 17 ఛాపర్ ఒడిదుడుకులకు గురైంది. దీంతో ఈ హెలికాఫ్టర్ ను గాల్లోనే వదిలేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *