ఎన్టీఆర్ ‘దేవర’లో డబుల్ రోల్? కొత్త పోస్టర్ వైరల్

Devara: Fans question if Jr NTR is playing double role as new poster with  faces of fear takes social media by storm | PINKVILLA

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. మొదటి భాగం సెప్టెంబరు 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అంటే సరిగ్గా ఇవాళ్టి (ఆగస్ట్ 27) నుంచి వచ్చే నెల 27 వరకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో మేక‌ర్స్ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

అయితే ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై చిత్రం యూనిట్ నుంచి మాత్రం అధికార ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తారక్ డబుల్ షేడ్‌ను పోస్టర్లో రివీల్ చేసింది. 

‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అనే క్యాప్షన్‌తో ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టర్ను మే‌కర్స్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్‌లో తారక్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. దీంతో దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారా? అనే సందేహాలు మరోసారి మొద‌ల‌య్యాయి. 

“మరో నెలలో అతడి రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో అతడి మెజెస్టిక్ మ్యాడ్నెస్ ను చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ మూవీ టీమ్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

కాగా, ఈ సినిమాలో తారక్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. విల‌న్‌గా మ‌రో బాలీవుడ్ న‌టుడు సైఫ్అలీ ఖాన్ న‌టిస్తున్నాడు. త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ పోస్ట‌ర్లు, గ్లింప్స్ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండ‌డంతో దేవ‌ర‌పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *