ఉపాధ్యాయుడు మత్తులో నిద్ర: కామాఖ్యనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

Drunk teacher in Shahdol government ...

తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే మన సంస్కృతి ప్రాధాన్యం ఇచ్చింది. విద్యార్థుల్లో స్ఫూర్తినింపి వారి భవిష్యత్తును బంగారుమయం చేసే బాధ్యతను సమాజం వారిపైనే పెట్టింది. అయితే, అలాంటి గురువుల్లో కొందరు నీచంగా ప్రవర్తిస్తూ మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

పూటుగా తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడికి ఆ తర్వాత మత్తు మరింత ఎక్కువైంది. కుర్చీలో కూలబడి అలాగే నిద్రపోయాడు. విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు అతడిని లేపేందుకు ప్రయత్నించినా చీమకుట్టినట్టు కూడా అతడికి అనిపించలేదు. ఈ ఘటన అస్సాంలోని కామాఖ్యనగర్‌‌లో జరిగినట్టుగా తెలుస్తోంది. నిద్రపోతున్న ఉపాధ్యాయుడి చుట్టూ చేరిన విద్యార్థులు గోల చేస్తూ ఆయనను నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఆయనలో చలనం కనిపించలేదు. అంతేకాదు, నిద్రమత్తులో కుర్చీలోనే ఆయన మూత్ర విసర్జన చేసినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు.

వీడియో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యావిధానం ఇప్పటికే దారుణంగా ఉందని, ఇలాంటి బాధ్యతారహిత ఘటనలు దానిని మరింత దిగజారుస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *