ఉక్రెయిన్‌కు మద్దతు కోరిన జెలెన్ స్కీ, శాంతి హామీ ఇచ్చిన మోదీ

On historic visit, Modi meets Zelensky with hug and handshake amid  Russia-Ukraine war | Latest News India - Hindustan Times

ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడుకోవడానికి పోరాడుతున్న తమకు భారత్ అండగా నిలబడాలని ఆ దేశ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. తటస్థంగా ఉండొద్దని కోరారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో తాము తటస్థంగా లేమని వివరించారు. యుద్ధాన్ని నిలవరించేందుకు ఎలాంటి సాయానికైనా తాను ముందుంటానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా కీవ్ లో మోదీని స్వాగతించిన జెలెన్ స్కీ కన్నీటిపర్యంతం కాగా తానున్నామంటూ మోదీ ధైర్యం చెప్పారు. యుద్ధం కారణంగా చనిపోయిన చిన్నారుల ఫొటోలు చూస్తూ జెలెన్ స్కీని హత్తుకుని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం జెలెన్ స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించుకున్నారు. భారత దేశం నుంచి తీసుకెళ్లిన మందులు, వైద్య పరికరాలను మోదీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కు అందజేశారు.

ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఫోటో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఫొటో చూసిన జెలెన్ స్కీ తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధి, ప్రపంచంలోనే అత్యంత నియంతను కౌగిలించుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది ఉక్రెయిన్- రష్యాల మధ్య శాంతి నెలకొల్పే ప్రక్రియకు మంచిది కాదని జెలెన్ స్కీ అప్పట్లో వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *