
రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు ఆగష్టు 21 బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆ సంఘం ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. భారత్‌బ బంద్‌లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు అన్నింటికీ సెలవు ఉంటుందా? ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎస్సీ ఎస్టీ గ్రూపుల్లో సబ్ కేటగిరీలు అర్హులైనవారికి రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం కోర్టు ఆగష్టు 1న తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన అంతిమ నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే తుదినిర్ణయం అని తీర్పునిచ్చింది. అయితే, దీన్ని వ్యతిరేకించిన బచావో సంఘర్ష్ బంద్‌కు పిలుపునిచ్చింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల్లో విబేధాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. అయితే, ఈ భారత్ బంద్‌కు వివిధ సామాజిక, రాజకీయ సంస్థల నుంచి మద్ధతు లభిస్తుందని భావిస్తున్నారు.
ఈ విషయంపై రేపు ఉదయం వరకు వేచి ఉండాల్సిందే. మరోవైపు బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని, తమకు ఇంకా ఎటువంటి అధికారిక స్పష్టత రాలేదని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. ఈ బంద్ దృష్ట్యా పోలీసుకు ఉన్నతాధికారులు సమావేశమై ఈ బంద్‌కు సిద్ధం కావాలని ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ సివిల్, పోలీస్ అధికారుల సమావేశం జరిగింది. అంతేకాదు రేపు ఆగష్టు 21న దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల పరిస్థితులపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రేపు జరగనున్న భారత్‌కు బంద్‌కు ఆర్టీసీ, రైల్వే శాఖల నుంచి కూడా అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు