తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ.. జడ్చర్లలో IIITకు సీఎం శంకుస్థాపన

cm revanth reddy lays foundation stone for iiit campus in telangana cm revanth reddy lays foundation stone for iiit campus in telangana

Mahabubnagar IIIT campus: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని చిట్టెబోయినపల్లి గ్రామ శివారులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఈ విద్యాసంస్థను నిర్మించనున్నారు.

భూమి పూజ అనంతరం సీఎం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చడమే ఈ ట్రిపుల్ ఐటీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Also Read:sudha murty on india partition | దేశ విభజన’పై సుధామూర్తి వ్యాఖ్యలు

ఈ సంస్థ ద్వారా స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మిస్తున్న అతిపెద్ద విద్యా సంస్థలలో ఈ IIIT ఒకటిగా నిలవనుంది. నిర్మల్ జిల్లా బాసర తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న రెండో ట్రిపుల్ ఐటీ ఇదే కావడం విశేషం.

వెనుకబడిన పాలమూరు ప్రాంతంలో ఈ సంస్థ ఏర్పాటు కావడం వల్ల, ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం విద్యార్థులకు తగ్గనుంది.

ఇంజనీరింగ్, ఐటీ, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఈ క్యాంపస్ అభివృద్ధి చెందనుందని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *