ఇన్‌ఫ్లుయెన్సర్ల కొత్త మోస పద్ధతులు
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు నిషేధం అయ్యిన తర్వాత, కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లు “లక్కీ డ్రా” పేరుతో కొత్త రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల ఆశలను ఆశ్రయంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
చట్ట ప్రకారం చర్యలు తప్పవు
ఈ తరహా మోసాలపై “Prize Chits & Money Circulation Schemes Act, 1978” ప్రకారం కేసులు నమోదు చేస్తారు. సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా స్టార్‌లు అయినా ఎవరికి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.
ALSO READ:PhonePe Scam | రూ.5,000 వస్తున్నాయి అని కాకృతి పడితే..ఇక అంతే సంగతి
కఠిన చర్యలు తప్పవు
సీపీ పేర్కొన్నారు, పాపులారిటీని అడ్డంగా పెట్టుకుని ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని. ఈ మేరకు “ఎక్స్ (ట్విట్టర్)” వేదికగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న లక్కీ డ్రా రీల్స్‌పై పోస్ట్ విడుదల చేశారు.
