Mana Shankarvaraprasad Garu Box Office Collections: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ హవా కొనసాగిస్తోంది. పాజిటివ్ టాక్‌తో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫుల్ గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తోంది.
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా, ప్రారంభ ప్రమోషన్ల నుండే ప్రేక్షకుల నుండి భారీ స్పందన పొందింది. కేవలం ఐదు రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా “రూ.226 కోట్లకు పైగా గ్రాస్” రాబట్టి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.
ALSO READ:Bhasma Aarti at Mahakaleshwar Temple | ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు
వీకెండ్‌లో మరిన్ని భారీ కలెక్షన్ల కోసం సినిమా బాక్సాఫీస్ సిద్ధమైంది. “చిరంజీవి కామెడీ టైమింగ్” సినిమా హృదయాన్ని గెలుచుకున్న ప్రధాన అంశం”మెగాస్టార్ చిరంజీవి” కామెడీ టైమింగ్. అలాగే, “విక్టరీ వెంకటేష్” నటిస్తున్నట్లు ప్రకటించడంతో, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
సంక్రాంతి సందర్భంగా “జనవరి 11″న రిలీజ్ అయిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్‌లో అత్యంత పాపులర్‌గా మారి, హృదయాలను గెలుచుకుంటూ బాక్సాఫీస్‌లో దూసుకెళ్తోంది.
