CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగంపై ఏర్పడిన వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. హెచ్‌ఓడీలు, సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడలేదని స్పష్టం చేశారు.
ప్రతి ఏడాది సుమారు 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించడం వల్ల శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు మళ్లిస్తున్నామని తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.
ALSO READ:Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి థ్రిల్లింగ్ ఇంటర్వల్ యాక్షన్ అప్‌డేట్!
ఎగువ ప్రాంతాల నుంచి వదిలిన నీటిని పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తరలించి వినియోగించుకుంటే ఎలాంటి తప్పు లేదని ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని వెల్లడించారు.
అమరావతి ప్రాజెక్టు స్ఫూర్తిదాయకమైన అభివృద్ధి నమూనా అని, ల్యాండ్ పూలింగ్‌కు 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం త్వరలో ప్రారంభిస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర సహకారంతో రూ.12 వేల కోట్ల ప్యాకేజీతో కాపాడుకున్నామని చెప్పారు.
