బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు

Police investigation scene after the BRS–Congress clash in Suryapet Police investigation scene after the BRS–Congress clash in Suryapet

Suryapet News: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మక రూపాన్ని దిద్దుకుంది. కర్రలు, రాళ్లతో జరిగిన పరస్పర దాడుల్లో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.

మృతుడు బీఆర్ఎస్ వార్డు మెంబర్ అభ్యర్థి మామ ఉప్పుల మల్లయ్యగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో మల్లయ్య తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తరలింపు సమయంలో మార్గ మధ్యలో మరణించినట్లు తెలుస్తోంది.

గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి  దర్యాప్తు.

ALSO READ:ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం | Jakarta building fire Accident

ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. 4,235 గ్రామ పంచాయతీల్లో మొత్తం 56.19 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే రోజు కౌంటింగ్ జరుగుతుంది.

ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలకు బంద్ ప్రకటించారు. మొదటి విడతలో ఇప్పటివరకు 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *