Telangana Rising Global Summit: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు పెట్టుబడిదారుల సందడి కొనసాగింది. ఫ్యూచర్ సిటీ(FUTURE CITY)లో ఏర్పాటు చేసిన ఈ సమిట్‌కు దేశ–విదేశీ కంపెనీలు భారీ ఆసక్తి చూపుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉండగా, పలు ప్రముఖ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు(MoUs) కుదుర్చుకున్నాయి.
ALSO READ:Indigo: ఇండిగో సంక్షోభం పై శీతాకాల సర్వీసులపై డీజీసీఏ కీలక నిర్ణయం
గోద్రెజ్ జెర్సీ సంస్థ హైదరాబాద్‌లో విస్తరణకు ఆసక్తి చూపుతూ పాలు, ఎఫ్‌ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులపై చర్చించింది. సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్ కూడా రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
భారత్ బయోటెక్ రూ.1,000 కోట్లతో సీఆర్‌డీఎంవో యూనిట్‌ను స్థాపించనుంది. ఫెర్టిస్ ఇండియా రెండు దశల్లో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కేజేఎస్ ఇండియా, వింటేజ్ కాఫీ, ఆర్‌సీపీఎల్, కైన్స్ టెక్నాలజీ వంటి కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.
జేసీకే ఇన్‌ఫ్రా రూ.9,000 కోట్ల పెట్టుబడి ప్రకటించగా, ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా మూడు దశల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. అదనంగా అక్వెలోన్ నెక్సస్ క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్, ఏజీపీ గ్రూప్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
రాష్ట్రంలో త్వరలోనే రూ.70,000 కోట్లతో ఏఐ-రెడీ డేటా పార్క్, రూ.2,000 కోట్లతో అరబిందో ఫార్మా విస్తరణ, గ్రాన్యుల్స్ ఇండియా నుంచి పెప్టైడ్స్ అండ్ ఆంకాలజీ సీడీఎంవో యూనిట్ వంటి భారీ పెట్టుబడులు రానున్నాయి.
