Home Minister Anita: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం(Tirupati Sanskrit University)లో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కేసు ప్రగతిపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు సేకరించేందుకు, సంబంధిత వివరాలు తెలుసుకునేందుకు ఒడిశాకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపినట్లు అనిత పేర్కొన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఈ ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు.
మహిళా భద్రతను ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసారు. ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయన్నది రాజకీయంగా మరియు సామాజికంగా చర్చనీయాంశంగా మారింది.
also read:PM Modi on Vande Mataram | వందేమాతరం కేవలం పాట కాదు… అది దేశ ఆత్మగౌరవం
