AP women loan scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతం కోసం శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీపై రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణ సదుపాయం అందిస్తోంది.
పిల్లల ఉన్నత విద్య, పెళ్లి ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి కుటుంబాల భారం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా రుణాలు నేరుగా 48 గంటల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ కావడం, రుణగ్రహీత మరణిస్తే రుణం రద్దు అయ్యే సౌకర్యం ఉండటం విశేషం.
ALSO READ:Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు
స్వయం సహాయక సంఘాల పనితీరును బట్టి A, B, C, D గ్రేడ్లుగా వర్గీకరిస్తూ రుణ పరిమితులను నిర్ణయించారు. ఏ గ్రేడుకు రూ.1 కోటి వరకు, బి గ్రేడుకు 90 లక్షలు, సి గ్రేడుకు 80 లక్షలు, డి గ్రేడుకు 70 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది.
కుటుంబ అవసరాలు, జీవనోపాధి, విద్య వంటి ఖర్చులకు అధిక వడ్డీ అప్పుల అవసరం లేకుండా ఆర్థిక బలం ఇవ్వడమే ఈ పథకాల లక్ష్యం. ఈ చర్యలు మహిళల స్వావలంబనను పెంచి, కుటుంబ స్థాయిలో ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
