Telangana Global Summit 2024: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. మొత్తం 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో సహా 1,686 మంది డెలిగేట్లు హాజరు కానున్నారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని పెట్టుబడిదారులు, గ్లోబల్ ఇండస్ట్రీ నాయకులు పాల్గొనే వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టడం, ఫ్యూచర్ సిటిని గ్లోబల్ హబ్(Global Hub)గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉంది.
ALSO READ:Akhanda 2 Movie Update | బాలయ్య అభిమానులకు శుభవార్త…కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ
మొత్తం 26 ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయగా, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి 15 ముఖ్య రంగాలపై చర్చలు జరగనున్నాయి. కిరణ్ మజుందార్ షా, పీవీ సింధు, రితేశ్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు.
సెమీకండక్టర్ రంగం, బ్యాంకింగ్, GCC విస్తరణ, PPP మోడల్ పెట్టుబడులు, జీనోమ్ వ్యాలీ అవకాశాలను గ్లోబల్ వేదికపై ప్రదర్శించనున్నారు.
42 దేశాలకు చెందిన 1,361 సంస్థలు పాల్గొనడంతో వచ్చే రెండు దశాబ్దాల అభివృద్ధికి ఈ సమ్మిట్ పునాది వేస్తుందనే అంచనా వ్యక్తమవుతోంది.
