Akhanda 2 Movie Update: నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ 2’(Akhanda 2) విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్లో నిరాశను సృష్టించింది. ఫైనాన్స్ సంబంధిత సమస్యల కారణంగా ప్రీమియర్ షోలు నిలిచిపోయాయన్న వార్తలు వినిపించాయి.
దీంతో అసలు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
తాజాగా నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేస్తూ, ‘అఖండ 2’ను పెద్ద తెరపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఊహించని సమస్యల వల్ల వాయిదా పడ్డాయని వెల్లడించింది.
ALSO READ:Sonu Sood Indigo Staff Support | ఇండిగో సిబ్బందికి మద్దతు ఇవ్వండి: సోనూసూద్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు క్షమాపణలు తెలుపుతూ, ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు తమ కృతజ్ఞతలు తెలిపింది.“కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం,” అని 14 రీల్స్ ప్లస్ ఎక్స్‌లో ప్రకటించింది.
మరోవైపు ప్రముఖ టికేటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో(Book My Show)కూడా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావచ్చని సూచిస్తూ అప్డేట్ చేసింది.
అధికారిక తేదీ వెల్లడించకపోయినా ఈ ప్రకటనలు చూస్తుంటే ‘అఖండ 2’ 2026లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు అభిమానులు మాత్రం సంక్రాంతి సీజన్‌కు రిలీజ్ అయ్యే అవకాశాన్ని చెబుతున్నారు.
