Chittoor Road Accident | కార్వేటి నగరం బోల్తా పడ్డ లారీ, బస్సు ఢీకొట్టి ఒకరు మృతి 

Karvetinagaram road accident scene with casualties and delayed medical response in Chittoor district Karvetinagaram road accident scene with casualties and delayed medical response in Chittoor district

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం ఆర్కే పేట వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ప్యాకెట్లు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడడంతో డ్రైవర్ మరియు క్లీనర్లను రక్షించేందుకు స్థానికులు పరుగులు తీశారు. ఇదే సమయంలో తిరుపతి నుండి పళ్లిపట్టు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి గ్రామస్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులుకు  తీవ్రంగా గాయపడ్డారు.

ALSO READ:TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం


గాయపడిన వారిని వెంటనే సమీపంలో ఉన్న కార్వేటి నగరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో చికిత్స ఆలస్యం అయ్యింది. ఈలోపే రామలింగం (65) అనే వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తి గిరిబాబు పరిస్థితి విషమంగా మారింది. అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ రాకపోవడం కూడా చికిత్సలో ఆలస్యానికి కారణమైందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

హాస్పిటల్ వద్ద స్థానికులు మరియు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఒక ప్రాణం పోయింది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ అత్యవసర సేవలు మెరుగుపరచాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *