ఫిల్మ్‌నగర్‌లో పట్టుబడ్డ నకిలీ ఐపీఎస్ అధికారి..బిల్డర్లపై బెదిరింపులు, వసూళ్లు
ఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిగా తిరుగుతున్న శశికాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటూ ఇద్దరి గన్మెన్లను వెంట తీసుకుని స్పెషల్ ఆఫీసర్‌గా బిల్డర్లను బెదిరించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ పలువురు బిల్డర్లను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
డబ్బు తీసుకున్న తర్వాత ప్రాజెక్టులు ఇవ్వకపోగా, తిరిగి అడిగిన వారికి గన్మెన్ల ద్వారా బెదిరింపులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ALSO READ:రంగనాథ్‌కు హైకోర్టు వార్నింగ్..హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్
ఈ మోసపూరిత వ్యవహారంపై పలు ఫిర్యాదులు అందడంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి, శశికాంత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతను ఉపయోగించిన నకిలీ గుర్తింపు కార్డులు, గన్మెన్ల వివరాలు, వసూలు చేసిన డబ్బుల లావాదేవీలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
గన్మెన్లు ఈ ఘటనలో సహకరించారా లేదా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. నిందితుడి నెట్వర్క్ గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
