Husband harassment: తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం, ధరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల శిరీషను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం శిరీష వంట సరిగ్గా చేయడం లేదన్న కారణంతో శివలింగం తరచూ ఆమెను అవమానిస్తూ వేధించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
అంతేకాక, తక్కువ చదువుకుందని కూడా విమర్శలు చేస్తూ శిరీషపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివలింగం, శిరీషను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం రోజువారీగా ఫోన్ చేసి, “నువ్వు నాకు అవసరం లేదు అక్కడే చావు” అని దూషించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యాఖ్యలు, అవమానాలు కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష, ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.. పెళ్లి తర్వాత మానసిక వేధింపులు పెరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ALSO READ:AP Road Accidents Counts | ఈ ఏడాది 15,462 ఘటనలు, 6,433 మరణాలు
