మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి శ్రీధర్ బాబు

Telangana Minister D. Sridhar Babu inaugurating a free sewing training center in Manthani Telangana Minister D. Sridhar Babu inaugurating a free sewing training center in Manthani

Minister D. Sridhar Babu: మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ఆయన ప్రారంభించారు.

ALSO READ: Constitution Day 2024 | రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కీలక సందేశం

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ— VIATRIS సౌజన్యంతో 850 కుట్టు మిషన్లతో మంథని ప్రాంతంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో 21 ఉచిత కొట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం. మహిళల ఆర్థిక పురోగతికి ఎంతో సహాయపడుతుందని తెలిపారు.

కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి మహిళల ఆదాయం ఎంతో కీలకమని, ఇందుకోసం ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని వివరించారు. మహిళలు నైపుణ్యాల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవడం, స్వయం ఉపాధిని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతోందని ఆయన చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆదాయ వనరులు పొందేలా కుట్టు శిక్షణ కేంద్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *