Telangana Rising 2047: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో జరగనున్న ఈ సమ్మిట్కు సంబంధించిన లోగోను అధికారులు తాజాగా విడుదల చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబడనున్న ఈ ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది.
also read:Dharmendra Passed Away:బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
మొదటి రోజు ప్రభుత్వంలోని కీలక పథకాల ప్రదర్శన నిర్వహించగా, రెండో రోజు ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ డాక్యుమెంట్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశలో రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సమ్మిట్‌కు పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ సమ్మిట్ కీలకంగా మారనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
