తెలంగాణాలో పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని BJP స్థానిక ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. పంచాయతీ, MPTC, ZPTC, GHMC డివిజన్లు మరియు వార్డులు సహా ప్రతి స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ కీలక నాయకులు వెల్లడించారు.
అన్ని స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వడం వల్ల పార్టీ ఓటు బ్యాంకు గతం కంటే గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
ALSO READ:Gold Price Today Hyderabad: తగ్గిన బంగారం–వెండి ధరలు
సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా, కార్యకర్తలను ముందుకు తీసుకువచ్చి BJP ప్రభావాన్ని గ్రామస్థాయిలో స్పష్టంగా చాటాలని నాయకత్వం భావిస్తోంది.
రాబోయే స్థానిక ఎన్నికల్లో పూర్తిస్థాయి సన్నాహాలు ప్రారంభించిన పార్టీ, రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టింది.
