AP Local Elections:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమ వుతున్నట్లు తెలుస్తుంది.
ALSO READ:సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్…దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి
స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చర్యలు వేగవంతం చేసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి స్వీకరించిన ఎన్నికల సంఘం, వాటిని మున్సిపల్ మరియు పంచాయతీ వారీగా విభజించే పనిలో ఉంది.
దీనికోసం మున్సిపల్, పంచాయతీల మాస్టర్ ట్రైనీలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలనే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నీలం సాహిని, పురపాలక–పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణను శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్సీపీ పాలనలో 2021 ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల తరువాత ఇది మొదటి పెద్ద ఎన్నికల ప్రక్రియ కావడంతో అన్ని వర్గాల దృష్టి ఏపీపైనే ఉంది.
