Panchayat Elections:తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాబోయే సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల(Reservations) విధివిధానాలను ఖరారు చేస్తూ ముఖ్యమైన జీవోను విడుదల చేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ(sc), ఎస్టీ(st), బీసీ(BC) మరియు మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు కానున్నాయి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ALSO READ:Pakistan Drone in Jammu Kashmir:జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం
రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు ఆదేశించబడ్డారు. ప్రత్యేకంగా గిరిజన గ్రామాల కోసం కీలక నిబంధన చేర్చబడింది. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయబడతాయని జీవో స్పష్టంగా పేర్కొంది.
ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన దశ పూర్తికావడంతో త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.
