పెర్త్‌లో జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్టులో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్. స్టార్క్ 172కే కుప్పకూలిన ఇంగ్లాండ్. స్టార్క్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ చేరి కేవలం “32.5 ఓవర్లలో 172 పరుగులకు” ఆలౌట్ అయ్యారు.
ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన స్టార్క్, చివరి వరకు తన వేగాన్ని, స్వింగ్‌ను ప్రతాపంగా నిలబెట్టుకుని ఇంగ్లాండ్‌ను చిత్తు చేశాడు.
ALSO READ:YV Subba Reddy SIT | అంతా అధికారులే చేశారు… SIT విచారణలో సంచలన వ్యాఖ్యలు
జాక్ క్రాలీ (0), జో రూట్ (0), మార్క్ వుడ్ (0) డక్ అవుట్ అవ్వగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ (6), అట్కిన్సన్ (1) త్వరగా పెవిలియన్ చేరారు. మరో వైపు ఒల్లి పోప్ (46), హ్యారీ బ్రూక్ (52) మాత్రమే కొంత ప్రతిఘటన చూపారు. చివర్లో జేమీ స్మిత్ (33) పరుగులు చేసినా, స్టార్క్ తిరిగి వచ్చి ఇన్నింగ్స్‌ను ముగించాడు.
మొత్తం స్టార్క్ “12.5 ఓవర్లలో 4 మెయిడెన్స్‌తో 58 పరుగులు ఇచ్చి 7 వికెట్లు” దక్కించుకున్నాడు.ఇతర బౌలర్లలో డాగెట్ 2 వికెట్లు, గ్రీన్ ఒక వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పూర్తిగా కూలిపోయింది.
