కర్లపాలెం పోలీసులు గురువారం వినూత్న విధానంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సహజంగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్లే వాహనదారులను ఆపి ఎవరు స్వీట్లు పెట్టరు. కానీ కర్లపాలెం పోలీసులు “హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను“సత్యవతి పేట వద్ద రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు.

ALSO READ:హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..తప్పిన ముప్పు

అదేవిధంగా హెల్మెట్ ధరించని వారిని ఆపి హెల్మెట్ ధరించకపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వారికి ఫైన్ విధించారు. మొత్తం మీద పోలీసులు వాహనదారులకు స్వీట్ పెట్టడం పట్ల వాహనదారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్లపాలెం ఎస్సై రవీంద్ర మాట్లాడుతూ రహదారి నియమాలను పాటించేవారిని తాము ఎప్పుడు గౌరవిస్తామని, అలాంటి వారి నోరు తీపి చేస్తే మరో 10 మంది పాటిస్తారని ఉద్దేశం అన్నారు.
మొత్తం మీద హెల్మెట్ పెట్టుకున్న వారికి నోట్లోకి స్వీట్ వచ్చింది. పెట్టుకొని వారికి ఫైన్ వచ్చింది.
